
జుక్కల్ జులై 4 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండలంలోని మొఘ గ్రామంలోని అంగన్వాడి చిన్నారులకు ప్రభుత్వం సరఫరా చేసిన దుస్తులను ఆ గ్రామ సర్పంచ్ బస్వంత్ పటేల్ శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారి పిల్లలకు విద్య అభివృద్ధి తో పాటు మంచి పౌష్టికాహారం సరఫరా చేస్తోందన్నారు. చిన్నారులకు తప్పనిసరిగా అందించాలని సూచించారు. చిన్నారులను తలిదండ్రులు అంగన్వాడీలకు పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ లు చిన్నారి పిల్లల తల్లిదండ్రులు చిన్నారులు పాల్గొన్నారు.