
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఆగస్టు. 5 తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు గ్రామంలోని ముస్లిం బజార్, ఎస్సీ కాలనీ, శివాలయం ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూర్ భాషా ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘం (రిజి. నం.203/2019) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.ఎస్. బాజీ సతీమణి రేష్మా సుల్తాన్ బాజీ జన్మదినాన్ని పురస్కరించుకుని మొత్తం 15 కుర్చీలను ఎర్రగొండపాలెం నూర్ బాషా సంఘం అధ్యక్షుడు నాసర్ అంగన్వాడీ కేంద్రాలకు ఈ కుర్చీలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వనం మాబు బాషా, వెలుగు క్రాంతి, షేక్ బాషా, పఠాన్ కరీముల్లా, అంగన్వాడీ టీచర్లు నాసరమ్మ, అచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు.