
జనం న్యూస్ ఆగస్టు 8 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : ఆషాఢ మాస బోనాల పండుగ సందర్భంగా కూకట్పల్లి డివిజన్ పరిధిలోని రజక బస్తీ, సంగీత్ నగర్, దయార్ గూడ ప్రాంతాల్లో అమ్మవారి తొట్టెల ఊరేగింపు కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. వివిధ కళా బృందాల ప్రదర్శనలు, భక్తుల సందడి మధ్య తొట్టెల ఊరేగింపు ఉత్సాహభరితంగా సాగింది.తొట్టెల ఊరేగింపు నిర్వాహకుల ఆహ్వానం మేరకు రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన వడ్డేపల్లి రాజేశ్వరరావు కి నిర్వాహకులు, స్థానిక భక్తులు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.బోనాల పండుగ సందర్భంగా నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో డివిజన్ నాయకులు చదుర్పల్లి శ్రీనివాస్ గౌడ్, అనంత నాగరాజు, దుర్గాప్రసాద్ రావు, నర్సింగ్, కట్ట శంకర్ రెడ్డి, రమణారెడ్డి, శివ పటేల్, మరియు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.