
జనం న్యూస్ జూన్ 13 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన గ్రామానికి చెందిన విత్తనాల కుశాల్ నాగ వెంకట్ (8) అంతర్జాతీయ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించి రికార్డు సృష్టించినందుకు ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు రాజు అభినందించారు.అమలాపురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 3వ తరగతి చదువుతున్న కుశాల్, 1 నుంచి 80 వరకు వర్గసంఖ్యల విలువలను కేవలం 1 నిమిషం 29 సెకన్లు 33 మిల్లీ సెకన్లలో చెప్పి ఈ ఘనత సాధించాడు.ఇప్పటికే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన కుశాల్, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందడం ఆనందదాయకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి జిల్లా, రాష్ట్రం, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.మర్యాదపూర్వకంగా కలిసిన కుశాల్ నాగ వెంకట్‌తో పాటు అతని తల్లిదండ్రులను ఎమ్మెల్యే అభినందించారు.