

జుక్కల్ ఆగస్టు 28 జనం న్యూస్ రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ హైదరాబాద్లోని తన నివాసంలో అక్కాచెల్లెళ్లతో రాఖీ కట్టించుకుని ఆత్మీయంగా రాఖీ పౌర్ణమి వేడుకలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా అక్కాచెల్లెళ్ల ఆశీర్వాదాలు స్వీకరించిన ఆయన, అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలు, ఆత్మీయత మరింత బలపడాలని ఆకాంక్షించారు.రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ప్రేమానురాగాలు వెల్లివిరియాలని కోరుకున్నారు