
బిచ్కుంద ఆగస్టు 20 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని నమ్మదగిన సమాచారం మేరకు బిచ్కుంద పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజుల X రోడ్ వద్ద ఒక ప్యాసింజర్ ఆటోను తనిఖీ చేయగా, అందులో సుమారుగా 21 బస్తాల PDS రైస్ అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించడం జరిగింది.ఈ వ్యవహారంలో షేక్ సాహెల్, మద్నూర్ గ్రామంకు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, PDS రైస్‌ను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించబడింది. ఈ విషయమై సివిల్ సప్లై అధికారుల దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది.బిచ్కుంద పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా PDS రైస్‌ను అక్రమంగా తరలించినా, నిల్వ చేసినా లేదా అక్రమంగా విక్రయించినా వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయి.ఇలాంటి అక్రమ కార్యకలాపాల గురించి ప్రజలకు ఏదైనా సమాచారం తెలిసినట్లయితే బిచ్కుంద పోలీస్ స్టేషన్ నంబర్: 8712686176కు సమాచారం అందించగలరు. సమాచారం అందించే వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. ఎస్సై రాజు తెలిపారు