

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా 11-09-26 నందలూరు మండలం: నాగిరెడ్డిపల్లి గ్రామంలోని అరవపల్లి రైల్వే గేట్ సమీపంలో ప్రసిద్ధి చెందిన జయలక్ష్మి ఫ్యాన్సీ స్టోర్* ఈరోజు తెల్లవారు జామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభ వించిన అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది.ఈ విషయం తెలుసుకున్న రాజ్యసభ సభ్యులు, ఎంపీ మేడా రఘునాథ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, నందలూరు మండల ఎంపీపీ మేడా విజయ భాస్కర్ రెడ్డి తో కలిసి అగ్ని ప్రమాద బాధిత కుటుంబాన్ని పరా మర్శించారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును, జరిగిన ఆస్తి నష్టాన్ని బాధిత కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.అనుకోని ప్రమాదంతో తీవ్రంగా నష్టపోయిన కుటుంబ సభ్యులకు ఎంపీ మేడా రఘునాథ రెడ్డి ధైర్యం చెప్పి కష్టకాలంలో వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి అవసర మైన సహాయ సహకారాలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అగ్ని ప్రమాదం కారణంగా తీవ్రంగా నష్టపోయిన కుటుంబం అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని ఎంపీ మేడా రఘు నాథ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.