
జనం న్యూస్ జూన్ 16 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గోవిందాపూర్ గ్రామం వద్ద ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) పాఠశాలలో అదనపు వసతుల నిర్మాణ పనులకు భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం పాఠశాల విద్యార్థినిలకు నోట్ బుక్స్ ను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,కేజీబీవీ పాఠశాలలో అదనపు వసతుల కల్పన కోసం రూ.38 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు తెలిపారు. విద్యార్థినులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని పేర్కొన్నారు. పాఠశాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు,అదనపు తరగతి గదులు,వసతి సౌకర్యాలు మరియు ఇతర అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.గ్రామీణ ప్రాంతాల విద్యార్థినులు ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు ఉండటం ఎంతో అవసరమని అన్నారు.ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి కట్టుబడి ఉందని, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం అవసరమైన ప్రతి సౌకర్యాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతి నిధులు, విద్యాశాఖ అధికారులు,ఎమ్మార్వో , ప్రసాద్ కుమార్,ఎంపీడీవో పాణి చంద్ర కాంగ్రెస్ పార్టీ మండలం అధ్యక్షులు దుదిపాల బుచ్చిరెడ్డి కార్యాలయ,సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.