
జనం న్యూస్ జూన్ 1 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) ఆదివారం అధిక జ్యేష్ఠ మాస పూర్ణిమ పండుగ సందర్భంగా శక్తి స్వరూపిణి గ్రామదేవత శ్రీ మావుళ్ళమ్మ తల్లి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని 500మామిడి పండ్లతోటి ప్రత్యేక అలంకరణ చేయడం జరిగిందిఈ కార్యక్రమంలో భాగంగా బ్రహ్మశ్రీ ఆణి విళ్ళ ఫణి కాంత్ శాస్త్రి ఆధ్వర్యంలో తొలుత వినాయకుని పూజ , అమ్మవారికి శ్రీ సూక్త విధానం పంచామృతాభిషేకం, నవగ్రహ హోమం, మృత్యుంజయ హోమం, పూర్ణాహుతి, కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్త శ్రీ పడగ శ్రీనివాసరావు గారు (పోస్ట్ మాన్) వారి ఆధ్వర్యంలో చక్కర పొంగలి ప్రసాద్ వితరణ జరిగింది .ఈ కార్యక్రమంలో ఆణివిళ్ళ సాయిబాబా, రామకృష్ణ పరమహంస, సంసాని పాండురంగారావు, సంసానీ రాంబాబు , శేష సాయి, బాల వాసు, పవన్ ,వేదుల శ్రీను, గ్రంధి రాంప్రసాద్, , నాగ భట్ల బ్రహ్మయ్య శాస్త్రి , సుంకర పవిత్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.ప్రతిరోజూ సేవా ట్రస్టు తరుపున,మరియు వివిధ దాతలు సహకారాలతో చలివేంద్ర కార్యక్రమం నిర్వహించడం జరుగును.పౌర్ణమి సందర్భంగా చలివేంద్ర లో భాగంగా ఈరోజు బాటసారులకు మజ్జిగను అందజేసిన వారు గ్రంధి నాగేశ్వరరావు గారు వారి కుమారుడు గ్రంధి బ్రహ్మాజీ గారు.రాత్రి 7 గంటలకు దీపోత్సవం కార్యక్రమం జరిగింది.అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.