
జనం న్యూస్ ఆగస్టు 18 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోఅనకాపల్లి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి తీర్మానం ప్రవేశపెట్టాలని కూటమి ప్రభుత్వాన్ని వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి సూరిశెట్టి రమణ అప్పారావు కోరారు. వైసిపి కార్యాలయంలో రమణ అప్పారావు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులు రెండు దఫాలుగా వరి విత్తనాలు వేసి, ఎల్వినో కారణంగా వర్షాలు లేక 90శాతం విత్తనాలు నిరుపయోగంగా మారి నష్టపోయారన్నారు. చోడవరం సుగర్ ఫ్యాక్టరీ బకాయిలు ప్రస్తుత ప్రభుత్వం చెల్లించక పోవడంతో, ఫ్యాక్టరీ మూసి వేస్తారనే భయంతో, రైతులు చెరకు పంటవదలి,అప్పులు చేసి వరిపంట వేస్తే వర్షాభావంతో దిక్కు తోచని స్థితిలో ఉన్నారన్నారు.తక్షణమే అనకాపల్లి జిల్లా రైతుల రుణాలను మాఫీ చేస్తూ , వారికి బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలను కూటమి ప్రభుత్వం మంజూరు చేయించి కష్టాలతో సతమత మవుతున్న రైతులను ఆదుకోవాలని రమణ అప్పారావు కోరారుఈకార్యక్రమంలో గౌరీ పిఎసిస్ మాజీ ఛైర్మన్ విల్లూరి శివసూరి, ఏడువాకుల నారాయణ రావు, రైతు విభాగం ప్రధాన కార్యదర్శి పెంటకోట సన్యాసి నాయుడు, రైతు నాయకులు యల్లపు గాంధీ, ఐటి వింగ్ పేలూరి కళ్యాణ్ పాల్గొన్నారు.//