
రూ.1.12 లక్షల చెక్కు అందజేత
జనం న్యూస్, సెప్టెంబర్ 5: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త స్వర్గీయ కంటం సురేష్ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.1,12,000 చెక్కును శనివారం గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షులు నూకల అశోక్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు కుటుంబ సభ్యులకు అందజేశారు.కంటం సురేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. అనారోగ్య సమయంలో ఆసుపత్రిలో ఆయనకు అందించిన వైద్య చికిత్సకు సంబంధించిన ఖర్చుల బిల్లులను రాష్ట్ర పంచాయతీరాజ్ ట్రైబ్యునల్ సభ్యులు బాస వేణుగోపాల్ యాదవ్ ద్వారా రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి సీతక్కకు అందజేయడంతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.1.12 లక్షల ఆర్థిక సహాయం మంజూరైనట్లు తెలిపారు.తమ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సునీల్ అన్న, బాస వేణుగోపాల్ యాదవ్‌లకు కంటం సురేష్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కష్టకాలంలో ప్రభుత్వం, పార్టీ నాయకులు అందించిన సహాయం మరువలేనిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు సోమ దేవరెడ్డి, దిబ్బ శ్రీనివాస్ , తుమ్మల ఆనంద్, రాంపెల్లి గంగాధర్, క్యాతం నవీన్, అడేం గంగా ప్రసాద్, జి కె శ్రీనివాస్, అవారి దేవన్న, తుమ్మల ప్రభాకర్,పిప్పెరవోయిన శివకుమార్ పాల్గొన్నారు.