
టైటిల్ భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాయంపేట మండల కేంద్రానికి చెందిన దానం మేఘన గారు అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఎల్.ఓ.సి (లెటర్ ఆఫ్ క్రెడిట్) ద్వారా రూ.3లక్షల 50 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీ పథకంలో కవర్ కాని వ్యాధుల చికిత్స కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్.ఓ.సి ద్వారా ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నదని తెలిపారు. అర్హులైన పేద, మధ్యతరగతి కుటుంబాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.తనకు అవసరమైన సమయంలో ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కి దానం మేఘన కుటుంబం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.