
, జనం న్యూస్ జూన్ 26: (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ, సీనియర్ నాయకులు దివంగత పీవీ చలపతిరావు జయంతి సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చీకరమెల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమా, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్, సీనియర్ నాయకులు కర్రి చిట్టిబాబు పాటు పలువురు నాయకులు పాల్గొని పీవీ చలపతిరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా అయ్యాజీ వేమా మాట్లాడుతూ, పీవీ చలపతిరావు దేశభక్తి, ప్రజాసేవ, సిద్ధాంత నిబద్ధతకు ప్రతీకగా నిలిచిన మహోన్నత నాయకుడని కొనియాడారు. జనసంఘ్ కాలం నుంచి భారతీయ జనతా పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేసిన ఆయన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పార్టీ విస్తరణకు విశేష సేవలందించారని పేర్కొన్నారు.అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) కాలంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ధైర్యంగా పోరాడిన ఆయన, ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా ప్రజా సమస్యలను శాసన మండలిలో సమర్థవంతంగా వినిపించారని గుర్తు చేశారు. విశాఖ ఉక్కు ఉద్యమం, కార్మికుల సమస్యలు, సామాజిక అంశాలపై ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని అన్నారు.పదవుల కోసం కాకుండా సిద్ధాంతాల కోసం రాజకీయాలు చేసిన నాయకుడిగా పీవీ చలపతిరావు ఎప్పటికీ ఆదర్శప్రాయులని, ఆయన ఆశయాలను ప్రతి కార్యకర్త కొనసాగించాలని నాయకులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అమలాపురం పట్టణ అధ్యక్షులు అయ్యాల భాస్కరరావు, రూరల్ అధ్యక్షులు బొంతు శివాజీ, కార్యాలయ ఇన్చార్జ్ డీవీఎస్ రాజు, మాజీ జిల్లా కన్వీనర్ ఇళ్ల సత్య నారాయణ, మన్నే రామదాసు, ఆరిగెల తేజ వెంకట్ మరియు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.