

జనం న్యూస్ 25 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజలో బి యల్ ఎ సమావేశం నిర్వహించిన ఏఐసీసీ సెక్రెటరీ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ఆదేశాల మేరకు ఐజ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఐజ బూత్ లెవల్ ఏజెంట్లకు (బి యల్ ఎ ) మరియు పార్టీ తరఫున యస్ ఐ ఆర్ ప్రక్రియ విధి విధానాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి అయిజ టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మహబూబ్ పాషా రఘు గౌడ్ ఆధ్వర్యంలో బి యల్ ఎ లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కౌన్సిలర్లు మద్దిలేటి సులోచనమ్మ మైనర్ బాబు పాల్గొన్నారు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి బూత్ బి యల్ ఎ కు తన బూత్ పరిధిలోని ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి,కొత్త ఓటర్ల నమోదు,పేర్ల సవరణలు చిరునామా మార్పులు, మరణించిన వారి పేర్ల తొలగింపు వంటి అంశాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలి. అదేవిధంగా ప్రతి బూత్‌లో ఇంటింటికీ వెళ్లి అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో బి యల్ ఎ ల పాత్ర ఎంతో కీలకమైనది. ప్రతి కార్యకర్త బాధ్యతగా పనిచేసి,మన బూత్‌ను ఆదర్శ బూత్‌గా తీర్చిదిద్దేలా చూడాలీ ప్రతి అర్హుడికి ఓటు హక్కు ప్రతి ఓటు ప్రజాస్వామ్యానికి బలం ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గతంలో పార్టీ కొరకు పనిచేశారో అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో కూడా అదే స్ఫూర్తితో పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని సూచించారు.కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు