
జనం న్యూస్ 01 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ; నిత్యం పదుల సంఖ్య లో డయాలసిస్ పెసెంట్స్ అవస్థ పడుతూ గద్వాల కు వెళుతున్నారు. పి యచ్చ్ సి లో సరిపడ డాక్టర్స్ లేక రోగులు కు తీవ్ర ఇబ్బదులు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సబ్యులు ఎస్.రామచంద్రారెడ్డి అయిజ 01-08-2026 ఈరోజు అయిజ పట్టణ & మండల అధ్యక్షలు తెలుగునర్సింహ గోపాల కృష్ణ ఆధ్వర్యం లో నిర్మాణం పెండింగ్ లో ఉన్న 30 పడకల హాస్పటల్ ముందు ధర్నా కార్యక్రమం జరిగింది ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ అయిజ కు సమీపంలో 1000 కోట్లతో (కర్నూల్ నుండి రాయచూరు అంచనా) నిర్మాణం అవుతున్న భారత్ మాల రోడ్ ఈ హాస్పటల్ భూమిపూజ తర్వాత ప్రారభం ఐనది దాదాపు పూర్తి అవుతుంది అదేవిధంగా అలంపూర్ రోడ్ దగ్గర లేటుగా భూమిపూజ ఐన 100 పడుకల హాస్పటల్ కూడా పూర్తిఐ వైద్య సేవలు ప్రారభం ఐనవి మరి యందుకు ఈ హాస్పటల్ పూర్తి కావడం లేదు అయిజ మండల పట్టణ జనాబా లక్షకు పైగ ఉంది రాష్ట్ర లో మిగితా ప్రాంతాలలో చిన్న చిన్న మండలాలలో 100 పడుకల హాస్పటల్స్ ఉన్నాయి కాని మన పాలకుల నిర్లక్షం తో ఈ చిన్న 30 పడుకల హాస్పటల్ కూడా పూర్తి కావడం లేదు ప్రజలు అన్ని గమనిస్తున్నారు సమయం వచ్చినప్పుడు తగిన బుద్ది చెబుతారు అని వారు మండి పడ్డారు ఈ కార్యక్రమం లో మహిళా మోర్చా ల జిల్లా అధ్యక్షులు బాబుల్ రెడ్డి,దేవదాసు సమతా గద్వాల పట్టణ అధ్యక్షులురాలు రజకజయశ్రీ,సద్దాల కృష్ణ,పాండు తూముకుంట అంజి దేవబండ రామకృష్ణ వర్మ,సాయి సతీష్ శాంతి నగర్ అశోక్ పైపాడు వెంకటేష్ తదితరులు పాలుగొన్నారు