
జనం న్యూస్ మే 29, వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని అయ్యప్ప కాలనీలో నిర్మాణంలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయ పనులను పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి, భవిష్యత్లో త్వరితగతిన పనులు పూర్తిచేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.స్థానిక నాయకులు కూడా పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. దాతలు ముందుకు వచ్చి గుడి నిర్మాణానికి సహకరించాలని కోరారు.