
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ బి వీరేశం ఆగస్టు 11. 08. 2026జహీరాబాద్. రాష్ట్ర ప్రభుత్వం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని, సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన విధంగా తెలంగాణా రాష్ట్రంలో 15 ఆగస్టు నాడు ఏకకాలంలో 2 లక్షల మంది అర్హులైన వారికీ పెన్షన్ మంజూరు ప్రక్రియ చేపడుతుందని గ్రామ సర్పంచ్ రాజ్ కుమార్ అన్నారు. మంగళవారం నాడు కోహిర్ మండలంలోని మనియర్ పల్లి గ్రామంలో సర్పంచ్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు.