
జనం న్యూస్ ఆగస్టు 17 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం అర్హులైన 50 సంవత్సరాల నిండిన ప్రతి పద్మశాలి లకుచేనేత చేయూత పింఛను ఇవ్వాలి శాయంపేట మండలం ప్రజావాణిలో ఎంపీడీవో ఫణి చంద్రకు దరఖాస్తు ఇచ్చిన తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం శాయంపేట మండల అధ్యక్షుడు వంగర సాంబయ్య అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూభారతదేశంలో వ్యవసాయం తర్వాత చేనేత పరిశ్రమననిచేనేత కుటుంబాలకు చేనేత పనిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో కల్పించకపోవడంతోభీమండి, సోలాపూర్, లాంటి ప్రదేశాలలో పవర్లూమ్స్ కార్మికులుగా ప్రభుత్వాల నుండి ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండా సంచార జీవులుగా జీవనం గడుపుతున్నారనినేత, పవర్ లూమ్స్, పనిచేసే క్రమంలోదుమ్ము, ధూళి, నోట్లో ముక్కుల ద్వారా శరీరంలోకి ప్రవేశించి అనేక వ్యాధులతో సతమతమవుతున్నారనిపని భద్రత లేనందునకుటుంబ సభ్యులు అనారోగ్యం పిల్లల చదువులు భారంతో
తెలంగాణలో 1600 మంది ఆత్మహత్యలు.చేసుకున్నారని అన్నారుఎలాంటి స్థిర చర ఆస్తులు భూములు కనీసం ఇండ్లు లేకుండా వలసలు పోతున్నారని మళ్లీ వారి గ్రామాలకు చేరుకుంటున్నారని ఇంతటి దుర్భర జీవితాలు గడుపుతున్న చేనేత కుటుంబాలను గుర్తించి 50 సంవత్సరాలు నిండిన పద్మశాలీలకు వారి స్థితి గతులను గుర్తించి జియో టాక్ తో సంబంధం లేకుండా అర్హులైన వారందరికీ చేయూత పింఛన్ మంజూరు చేయాలనిఅవసరమైతె ప్రత్యేకంగా ప్రభుత్వంతో చర్చించి న్యాయం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు వంగర సాంబయ్య ఉపాధ్యక్షుడు చిందం రవి దిడ్డి ప్రభాకర్ కొండ ముకుంద బూర లక్ష్మీనారాయణ సాంబారి జనార్ధన్ తుమ్మ ప్రభాకర్
రంగు మహేందర్ గొట్టిముక్కుల రమేష్ పసునుటి బిక్షపతి వడ్డేపల్లి మహేందర్ తదితరులు పాల్గొన్నారు….