
జనం న్యూస్ 20 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : ఈరోజు గురువారం నాడు చిరంజీవి ఆగస్టు 22వ తారీకు జన్మదిన సందర్భంగా రెండు రోజులు ముందుగానే వేడుకలు మొదలుపెట్టిన అలంపూర్ తాలూకా అసోసియన్ చిరంజీవి అభిమానులు అఖిలభారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు రవణం స్వామి నాయుడు ఆదేశాల ప్రకారం అలంపూర్ తాలూకా చిరంజీవి అభిమాన అసోసియేషన్ అధ్యక్షుడు రాజోలి శివరామయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం రాజోలి చిన్న బజార్ పీర్ల పెద్ద మసీదులో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రక్త దాతలుగా ముందుకు వచ్చిన గ్రామ ప్రజలు చిరంజీవి అభిమానులు యువకులు మహిళలు అందరూ కలిసి దాదాపు 42 యూనిట్ల రక్తాన్ని జోగులాంబ గద్వాల్ ప్రభుత్వ వైద్యశాల సమస్త వారికి సేకరించి ఇవ్వడం జరిగింది.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెగా చిరంజీవి అభిమాని శాంతినగర్ అమెరికా యన్ ఆర్ ఐ నివాసి అయినా రేపల్లె విజయ్ తల్లిదండ్రులతో రిబ్బన్ కటింగ్ చేపించి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది కార్యక్రమంలో పాల్గొన్న రాజోలి మండల ఎస్సై కిరణ్ కుమార్ మరియు జోగులాంబ గద్వాల జిల్లా జడ్పీ కో ఆప్షన్ మాజీ సభ్యులు రాజోలి నిషాక్ మాట్లాడుతూ అన్ని దానాల్లో కన్నా రక్తదానం మిన్న అంటూ గ్రామ ప్రజలకు మంచి సూచన లిస్టు ఇలాంటి కార్యక్రమంలో యువత ముందుకు రావాలి రక్తదానం చేయడం వలన మన ఆరోగ్యం మంచి ఉంటుంది అలాగే ప్రమాదంలో ఉన్న వారి ప్రాణాలు కూడా కాపాడినట్టు అవుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు అలాగే గ్రామంలో ఉండే చిరంజీవి అభిమానులు ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం వల్ల ప్రజలకు మంచి అవగాహన వస్తుంది ఏదైనా ప్రమాదంలో ఉన్నవారికి రక్తదానం చేయడానికి ముందుకు రావడంలో సహాయ సహకారం అందించినట్టు అవుతుందని ఇలాంటి కార్యక్రమాలకు మా వంతు సహాయ సహకారం కూడా అందిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ వైద్య శాల బృందం మరియు సిబ్బంది కర్నూల్ మెగా ఫ్యాన్స్,అలంపూర్ తాలూకా జనసేన ప్రజా ప్రతినిధులు రాజోలి చిరంజీవి అభిమానులు గ్రామ ప్రజలు యువకులు కొత్త రాజోలి అఖిలపక్ష కమిటీ సభ్యులు పోలీస్ శాఖ వారు జరిగింది