
మూసాపేట్ డివిజన్ మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు చున్ను పాషా ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ శ్రేణులు
జనం న్యూస్ | జూలై 15 | తెలంగాణ స్టేట్ ఇంచార్జ్: శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గంలోని మూసాపేట్ డివిజన్ ఆంజనేయ నగర్ చౌరస్తాలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మూసాపేట్ డివిజన్ మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చున్ను పాషా ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించగా, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా బండి రమేష్ కి శాలువాతో సన్మానించి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నాయకులు పుష్పగుచ్ఛాలు అందజేసి ఆయనకు దీర్ఘాయుష్షు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారంలో బండి రమేష్ ఎల్లప్పుడూ ముందుండే నాయకుడని కొనియాడారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తూ "నేనున్నాను" అనే భరోసా కల్పించడం ఆయన ప్రత్యేకత అని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా అధికారులతో సమన్వయం చేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న నాయకుడిగా బండి రమేష్ గుర్తింపు పొందారని తెలిపారు.ప్రజాసేవే ధ్యేయంగా నిరంతరం శ్రమిస్తున్న బండి రమేష్‌కు ప్రజల ఆదరణ, పార్టీ కార్యకర్తల మద్దతు మరింత పెరగాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కాంగ్రెస్ శ్రేణులు కేక్ పంపిణీ చేసి ఆనందోత్సాహాల మధ్య వేడుకలను ముగించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.