
జనం న్యూస్ జూలై 09 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డిఆంధ్ర–తెలంగాణ రాధా–రంగా మిత్రమండలి ధర్మ సేవా సంస్థ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా తనను నియమించిన సంస్థ వ్యవస్థాపకులు పన్నాస పూర్ణచంద్రరావు (కాళ్లపాలెం బుజ్జి)కు నారాయణ జయప్రకాశ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రంగా అభిమానుల సేవలో అంకితభావంతో పనిచేస్తానని, సంస్థ అభివృద్ధికి తన వంతు కృషిని నిరంతరం కొనసాగిస్తానని పేర్కొన్నారు. అనంతరం ఆయన ఆర్కెపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు పొందారు. ప్రజలకు, రంగా అభిమానులకు మరింత సేవ చేయాలని ఆర్కెపూడి గాంధీ సూచిస్తూ ఆశీర్వదించారు. అలాగే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు వడ్డేపల్లి రాజేశ్వర్ రావును కలిసి ఆయన ఆశీర్వాదాలు కూడా పొందారు. అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు, అభిమానులకు ఎల్లప్పుడూ సేవ చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రగతి నగర్ కోశాధికారి రొక్కం శంకర్, తెలంగాణ మహిళా అధ్యక్షురాలు ద్రాక్ష వేణి, తెలంగాణ కార్యదర్శి దామెర్ల రామచంద్ర, శేరిలింగంపల్లి అధ్యక్షుడు సురేష్, నాగరాజన్, జిల్లెల దేవరాజులు, పార్థసారథి, రంగా అభిమానులు అల్లూరి రామ్ రాజ్, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు నర్సింగ్ రావు, సాయి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా నారాయణ జయప్రకాశ్ సంస్థ అభివృద్ధికి, ప్రజా సేవకు పూర్తిస్థాయిలో కృషి చేస్తానని మరోసారి పునరుద్ఘాటించారు.