
జనం న్యూస్ జూలై 23 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ : ఆగస్టు 8,9 తేదీల్లో విశాఖ లో జరిగే ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (AITUC) రాష్ట్ర 4వ, మహాసభలు జయప్రదం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు కోన లక్ష్మణ పిలుపు నిచ్చారు. మంగళవారం పట్టణం లో చోడవరం బస్ స్టాండ్ వద్ద జరిగిన సమావేశం లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆటో అండ్ మోటార్ కార్మికులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రభుత్వాలు వాహన మిత్ర హిత హామీని (₹15,000 ఇస్తామాని) తుంగలో తొక్కాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీవో నెంబరు 21,31 తో డ్రైవర్లపై ₹10,000 లు భారీ జరిమానాలు వేసి ఉరితాడు తగిలిస్తున్నాయి. ఉచిత ఆర్టీసీ మహిళలకు ఫ్రీ బస్సు (స్త్రీ శక్తి పథకం) వల్ల ఆటో,మోటార్ కార్మికులు 60% దాకా ఆదాయాన్ని కోల్పోయారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు, డీజీలు, సీఎన్జీ గ్యాస్, నిత్యవసర వస్తువులు ధరలను పెంచి తీవ్రమైన ఆర్థిక భారం వేస్తున్నాయి. అమ్మ పెట్టదు అడుక్కునివ్వదు అని సామెత గుర్తు చేశారు. *ఫెడ రేషన్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శి లు పెద్దిరెడ్ల నాగేశ్వరరావు,కోరిబిల్లి జగదీష్ మాట్లాడుతూ 15,000 వాహన మిత్ర 11 లక్షల మంది ఆటో, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లందరికీ ఇవ్వాలన్నారు.జీవో నెంబరు 21,31ను వెంటనే రద్దు చేయాలి. చెల్లిస్తున్న పన్నుల నుండి 1% సెస్ (Cess) కలెక్ట్ చేసి ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి.ఉచిత ఆర్టీసీ స్త్రీ, శక్తి పథకం వల్ల ఆదాయం కోల్పోయిన డ్రైవర్లకు నెలకు ప్రత్యేక జీవన భృతి కల్పించాలి. పెంచిన పెట్రోల్, డీజిల్, సీఎన్జీ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి. ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపుల నుండి డ్రైవర్లకు చట్టపరమైన రక్షణ కల్పించాలని కోరారు. కార్యక్రమం లో అప్పన్న దొర, మామిడి శంకర రావు, బల్లిరెడ్డి దేవుడు బాబు, కాండ్రేగుల ఉమా, గండి బోయిన ప్రసాద్, అచ్చుతరావు, మోహన్ రావు, నారాయణ,నాయుడు, సతీష్, పల్ల నూకరాజు, కె శ్రీను, తదితరులు పాల్గొన్నారు.//