
జనం న్యూస్ ఆగస్టు 14 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ : ఈ నెల 20,21,,తేదీల్లో విశాఖ లో జరిగే ఆంధ్రప్రదేశ్ ఆటో అండ్ మోటార్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర మహాసభలును జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి రెడ్డి పల్లి అప్పలరాజు, సంఘం గౌరవధ్యక్షులుకోన లక్ష్మణ పిలుపునిచ్చారు. చోడవరం ఆటో స్టాండ్ వద్ద సంబందించిన మహాసభల వాల్ పోస్టర్స్ ను కార్మికులు తో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటో అండ్ మోటార్ ట్రాన్స్ పోర్ట్ కార్మికులు కు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు ఎక్కువడం అవ్వడం ద్వారా ఆటో డ్రైవర్స్, కారు, బస్సు, టాటా లగేజీ, జేసీబీ ఆపరేటర్స్, లారీ, అనేక రకాల డ్రైవర్స్ రోజులు వారి ఉపాధి కోసం డ్రైవర్ గా పని చేస్తున్నారు వీరికి రోజు వారి ప్రయాణంలో ప్రమాదాలు జరుతున్నాయి. చాలామంది చని పోతున్నారు, పిల్లలు చదువులు,ఇంటి పోషణ, అనేక ఆర్థిక ఇబ్బందులు గురి అవుతున్నారు అందుకే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, జి వో నెం -21,31 నీ రద్దు చేయాలి, ఈ జివోలు వల్ల ఆర్టీవో, ట్రాఫిక్ పోలీస్ లు చలానాలు ఫైన్లు పేరుతో ఆటో కి 10 వేలు, 20,వేలు ఎలా పడితే అలా వసూలు చేస్తున్నారు చాలి చాలని డబ్బులతో ఎలా బ్రతుకు సాగించాలి పైగా రాష్ట్ర ప్రభుత్వం వాహన మిత్ర పేరుతో పచ్చి అపద్దాలు ఆడుతుంది వాహన మిత్ర పూర్తి స్థాయి 15 వేలు అందరికి అందని పరిస్థితి ఉందని విమర్శించారు. తక్షణమే జీవో 21,31 నీ రద్దు చేయాలని, సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో కార్మికులు దేశంశెట్టిమాధవరావు,నాగులపల్లి గోవిందా, పులేటి నరేంద్ర, రాలపల్లి సత్యనారాయణ,పల్ల నూకరాజు, కర్రి శ్రీనివాసరావు, డోంకా ఈశ్వరరావు, రాలపల్లి వెంకటరమణ, సత్తి ఈశ్వరరావు, పి గణేష్,తదితరులు పాల్గొన్నారు.//