
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం జహీరాబాద్, (జూన్25) :మండల పరిధిలోని హుగ్గేల్లీ గ్రామంలో సామాజిక బాధ్యతతో ముందుకు వస్తున్న సర్పంచ్ పట్లోళ్ళ.విమల శ్రీనివాస్ రెడ్డి గారు మరోసారి తన మాట నిలబెట్టుకున్నారు.ఎన్నికల సమయంలో గ్రామంలోని ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందిస్తామని ఇచ్చిన హామీ మేరకు గురువారం(శ్రీమతి సునీత-జైరాజ్) కుమార్తె దీపిక వివాహా నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి పెళ్లికానుకగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ పట్లోళ్ళ. విమల శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ గ్రామంలోని ఆడబిడ్డల పెళ్లిళ్లకు తన వంతు సహాయం అందించడం ఆనందంగా ఉందని తెలిపారు.ఈసందర్భంగా వధువు కుటుంబ సభ్యులు తమ కుమార్తె పెళ్లికి సహాయం అందించిన సర్పంచ్ విమల శ్రీనివాస్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, యూత్ కాంగ్రెస్ సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ రెడ్డి,గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజు,సీనియర్ నాయకులు నర్సింహులు,బాల్ రాజ్, రాజశేఖర్, సిద్దారెడ్డి, మశ్చేందర్, రాములు, ఏసప్ప, ప్రేమ్, సంజీవ్ మరియు తదితరులు పాల్గొన్నారు.