
మన ఇసుక మన వాహనం కార్యక్రమం పై ట్రాక్టర్ యజమానులకు డ్రైవర్లకు అవగాహన సదస్సు
బిచ్కుంద జూన్ 9 జనం న్యూస్ ; కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం లోని హస్గుల్ గ్రామ పరిధి లో గల ఇసుక క్వారీ ను ఆన్లైన్లో ఇసుక సరఫరా కొరకు కొత్తగా మన ఇసుక - మన వాహనం పథకం లో చేర్చడం జరిగింది.అందువలన మంగళవారం రోజు హస్గుల్ గ్రామంలోని రైతు వేదికలో మన ఇసుక మన వాహనం కార్యక్రమం పై ట్రాక్టర్ యజమానులకు డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించినైనది. ఆన్లైన్ ఇసుక రవాణా విధానంలో తీసుకోవాల్సిన చర్యలు జాగ్రత్తల గురించి ట్రాక్టర్ డ్రైవర్లకు ఓనర్లకు వివరించడం జరిగింది. ఆన్లైన్ ఇసుక విధానం హస్గుల్ లో మొదలు పెడుతున్నందున గ్రామంలో ఎటువంటి డంపులు ఏర్పాటు చేయవద్దని మరియు ఇసుక నింపిన ట్రాక్టర్లు ట్రాలీలు ఉండడానికి వీలులేదని కేవలం నదిలోని ఇసుక పాయింటు నుండి ఇసుక ఆన్లైన్ ద్వారా ఓటిపి ద్వారా ఇవ్వడం జరుగుతుందని వారికి తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వేణుగోపాల్ ఎస్సై రాజు గ్రామ సర్పంచ్ ట్రాక్టర్ డ్రైవర్లు ఓనర్లు గ్రామస్తులు పాల్గొన్నారు.