
జనం న్యూస్ :27 జూలై సోమవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్:ఈ నెల 11న అకాల మరణం చెందిన ప్రైవేట్ ఉపాధ్యాయుడు గంగాల పర్షరాములు కుటుంబానికి మానవతా దృక్పథంతో తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం మరియు ఎంసీఏ హెల్పింగ్ హ్యాండ్స్ సంయుక్తంగా ఆర్థిక సహాయం అందజేశాయి.మృతుని ఇద్దరు కుమార్తెల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారి పేర్లపై రూ.51,000 చొప్పున (మొత్తం రూ.1,02,000) స్థిర నిక్షేపాలు చేయడంతో పాటు రూ.5,000 విలువైన నిత్యావసర సరుకులు అందజేశారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి, కష్టకాలంలో తోటి వారికి చేయూత అందించడం నిజమైన మానవత్వమని పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన ప్రైవేట్ ఉపాధ్యాయులందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కాచం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నవీద్, ఉపాధ్యక్షుడు యాసరేని సిద్దు ప్రజాపతి, ప్రచార కార్యదర్శి యాంసాని రాజేష్, కరుణాకర్ రెడ్డి, బాలకృష్ణారెడ్డి, సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.