
కమలా నెహ్రూ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ ఉద్యోగుల ఆవేదన
అభయ మేన్పవర్ సప్లయర్స్పై ఆరోపణలు
జనం న్యూస్- సెప్టెంబర్ 10- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రిలోని ఆరోగ్యశ్రీ విభాగంలో అభయ మేన్పవర్ సప్లయర్స్ ద్వారా విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి 11 నెలలుగా జీతాలు అందడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలల తరబడి వేతనాలు అందకపోవడంతో కుటుంబ పోషణతో పాటు రోజువారీ ఖర్చులు నిర్వహించడం కష్టంగా మారిందని వారు వాపోతున్నారు.ఆరోగ్యశ్రీ విభాగంలో విధులు నిర్వహిస్తూ రోగులకు సంబంధించిన పలు సేవలు అందిస్తున్న తమకు ఇంతకాలం జీతాలు చెల్లించకపోవడంపై సిబ్బంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 11 నెలలుగా వేతనాలు బకాయి ఉండటంతో తమ ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారిందని ఉద్యోగులు పేర్కొంటున్నారు.తమ సమస్యను సంబంధిత అభయ మేన్పవర్ సంస్థతో పాటు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు సరైన పరిష్కారం లభించలేదని సిబ్బంది ఆరోపిస్తున్నారు. వెంటనే బకాయి వేతనాలను చెల్లించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.11 నెలలుగా జీతాలు ఎందుకు పెండింగ్లో ఉన్నాయి?సంబంధిత అధికారులు స్పందించి వాస్తవ పరిస్థితిని వెల్లడించాలి.ఆరోగ్యశ్రీ విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి బకాయి వేతనాలను వెంటనే చెల్లించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు.