
జనం న్యూస్ ఆగస్టు 20 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) ముమ్మిడివరం నియోజకవర్గం గేదెల్లంక గ్రామంలో కాలుకు ఇన్ఫెక్షన్ సోకి ఆపరేషన్ కు ఎక్కువ ఖర్చు అయ్యి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వ్యక్తికి జనసేన నాయకులు ఆర్థిక సహాయం అందించారు.మారిశెట్టి రాముడు, ఆదిలక్ష్మి దంపతుల మనవడు సాత్విక్ రామ్ మొదటి పుట్టినరోజు సందర్భంగా సాత్విక్ పెదనాన్న సాయి కృష్ణ సహకారంతో 3000 రూపాయలు, జనసేన నాయకులు గుద్దటి జమీ సహకారంతో 2500 రూపాయలు చొప్పున మొత్తం 5500 రూపాయలు బాధితుడికి జమీ చేతుల మీదుగా అందించారు.సూరపురెడ్డి సురేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కోన సత్తిబాబు పాల్గొన్నారు. సహాయం అందుకున్న సత్తిబాబు సాత్విక్ ని దీవిస్తూ దాతలు సాయి, జమీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.కష్టంలో ఉన్న వారికి అండగా నిలవడమే నిజమైన సేవ అని జనసేన నాయకులు అన్నారు.