
జనం న్యూస్ జూలై 18 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ; ఆర్.ఆర్. విద్యా భవన్ హైస్కూల్ ఆధ్వర్యంలో, మల్లారెడ్డి హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని వెంకటేశ్వర నగర్ కూకట్పల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంబించారు.పాఠశాల ఆవరణలో విద్యార్థులు,వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది మరియు స్థానిక ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి హాస్పిటల్కు చెందిన నిపుణులైన వైద్యులు మరియు వైద్య సిబ్బంది పాల్గొని ప్రతి ఒక్కరికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. మరింత వైద్య చికిత్స అవసరమైన వారికి మల్లారెడ్డి హాస్పిటల్లో రాయితీ ధరలతో చికిత్స పొందేందుకు ప్రత్యేక రిఫరల్ కార్డులు అందజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ వి. సుబ్రహ్మణ్యం, ప్రధానోపాధ్యాయురాలు సూర్యకుమారి, ఉపాధ్యాయులు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.ఈ వైద్య శిబిరాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు మరియు ప్రముఖులు చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాయ రాజయ్య, దేవేందర్ రెడ్డి, ఎల్లా రెడ్డి తదితరులు సందర్శించి, సమాజ సేవా దృక్పథంతో విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు స్థానిక ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలాంటి సేవా కార్యక్రమాన్ని నిర్వహించిన ఆర్.ఆర్. విద్యా భవన్ హైస్కూల్ యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ, సమాజానికి ఉపయోగపడే విద్యా, ఆరోగ్య మరియు సేవా కార్యక్రమాల ను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని తెలిపింది. కార్యక్రమ విజయానికి సహకరించిన మల్లారెడ్డి హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది మరియు పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.