
జనం న్యూస్ ఆగస్టు 6 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి: ఆషాఢ మాసం ముగింపు సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గంలోని అమ్మవారి దేవాలయాలు బోనాల ఉత్సవాలతో భక్తుల రద్దీతో కళకళలాడుతున్నాయి. ఈ సందర్భంగా దేవాలయ కమిటీల ఆహ్వానం మేరకు కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్, టీపీసీసీ ఉపాధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ మూసాపేటలోని నల్లపోచమ్మ అమ్మవారి ఆలయం, ఎల్లమ్మ ఆలయం, ముత్యాలమ్మ ఆలయం, బంగారు మైసమ్మ ఆలయం, పోచమ్మ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవార్ల ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, ఆషాఢ బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. అమ్మవారి కటాక్షంతో రాష్ట్రం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని, ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. అలాగే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏ-బ్లాక్ అధ్యక్షులు నాగిరెడ్డి, బి-బ్లాక్ అధ్యక్షులు తూము వేణు, మూసాపేట అధ్యక్షులు తూము సంతోష్, మల్లేష్ యాదవ్, సప్పిడి భాస్కర్, తోట రాజు, బాలరాజు, జోజమ్మ, దేవాలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.