
జనం న్యూస్ జూలై 27 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపట్టిన "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమంలో భాగంగా 2 ఏళ్ల అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రభుత్వ పథకాల గురించి తెలియజేశారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి, జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, పి.గన్నవరం నియోజకవర్గ కో కన్వీనర్ మోకా ఆనందసాగర్ పాల్గొన్నారు.అలాగే మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు డొక్కా నాధ్ బాబు, పి.గన్నవరం మండల పార్టీ అధ్యక్షురాలు ప్రత్తిపాటి ఉమామహేశ్వరి, అంబటి భూలక్ష్మి, పులపర్తి సుజాత, ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు యాళ్ల ఉదయ్, క్రాప మాజీ సర్పంచ్ బొబ్బిలి అయ్యప్ప, ముమ్మిడివరం టౌన్ నాయకులు భీమవపు శ్రీనివాస్, జాతీయ ప్రజాస్వామ్య కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని నాయకులు తెలిపారు.