
జనం న్యూస్ 21 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం తొట్టినొని దొడ్డి గ్రామం లో టి.గోవిందమ్మ,కు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయ్యింది. గ్రామ సర్పంచ్ బిల్లు చేయించకుండా ఆపుతున్నాడు పంచాయతీ సెక్రెటరీ ముగ్గు పోయించి ఇంటి నిర్మాణం కొరక బునాది తవ్వి బేస్ మఠం అయిన తర్వాత మొదటి బిల్లు కొరకు అయిజ ఎం పి డి ఒ.ని నాకు బిల్లు రాలేదు సార్ అని అడగగా ఆయన చెప్పిన సమాధానం మీ గ్రామ పంచాయతీ సర్పంచ్ నీ బిల్లు చేయవద్దని చెప్పడం జరిగింది. ఎందుకు అని అడగగా నీవు ఆరు ఫీట్లు ముందుకు వచ్చావు అని చెప్పడం జరిగింది.కనుక పంచాయతీ సెక్రటరీ ముగ్గు పోసిన తర్వాతే నేను ఇల్లు నిర్మించుకుంటున్నాను నాది ఎలాంటి పొరపాటు లేదు గవర్నమెంట్ అధికారి పంచాయతీ సెక్రటరీ చేసిన తప్పు వలన నాకు ఇప్పటికీ ఇందిరమ్మ బిల్లు రావడం లేదు. మా పొరపాటు కాదు అంటున్న టి.గోవిందమ్మ, సార్ నాకు ఎలాగైనా న్యాయం చేయండి అంటున్న బాధితురాలు. దీనికి బాధ్యులు ఎవరు. గ్రామ సెక్రెటరీ తప్పుడు కొలతల వల్ల ఇందిరమ్మ బిల్లు ఆగడం జరిగింది. గ్రామంలో ఎన్నో ఇండ్లు మెయిన్ రోడ్డుకు వచ్చాయి వాటి పరిస్థితి ఏమిటి నా ఒక్క ఇల్లు మాత్రమే ఉందా ఊరిలో అందరికీ ఒక న్యాయం నాకు ఒక్క దానికి ఒక న్యాయం అంటున్న బాధితురాలు కాంగ్రెస్ ప్రభుత్వం నాకు ఇల్లు లేదు అని ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయ్యింది. తీరా చూస్తే సర్పంచ్ నాకు లక్ష రూపాయలు అడుగుతున్నారు. మీరు నేను అడిగిన డబ్బులు ఇస్తేనే బిల్లు చేయిస్తాను లేకపోతే మీ ఇల్లు ఎంతవరకు అయినా ఆపుతాను అంటున్న సర్పంచ్ నా బిల్లు ఆపడం ఎంతవరకు న్యాయం అని గ్రామ ఉప సర్పంచ్ ని అడిగితే నేను అందరికీ చెప్తున్నాను బిల్లు చేయమని వారు నా మాట వినడం లేదు. మా కాంగ్రెస్ పార్టీ పేదలకు ఇల్లు ఇవ్వాలని మీకు ఇందిరమ్మ ఇల్లు చేయించాము అయినా సర్పంచ్ వినడం లేదు. టి.గోవిందమ్మ, కొడుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికే ఇలా జరిగితే మిగతా సామాన్యుల పరిస్థితి ఏది. బిఆర్ఎస్ పార్టీలో ఉన్న సర్పంచ్ ఇంత డిమాండ్ చేస్తూ ఉంటే ఎలా ప్రతిపక్ష నాయకులకు ఇంత అధికారం ఉందా అలాగైతే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పిన వినడం లేదు. దీని అర్థం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మాట చెల్లుబాటు కావడం లేదు అంటున్న ఉప సర్పంచ్. నాకు ఎలాగైనా సహాయం చేయండి సార్ అంటూ అధికారులను వేడుకుంటున్న బాధితురాలు.
