
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం ఆగస్టు 02. 08. 2026 గ్రామ అభివృద్ధే మా లక్ష్యం – సర్పంచ్ కుమ్మరి రాజేశ్వరి గోపాల్ జహీరాబాద్, ఆగస్టు 2: జహీరాబాద్ నియోజకవర్గంలోని జరా సంఘం మండలం గినియార్పల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తమ ప్రధాన లక్ష్యమని గ్రామ సర్పంచ్ కుమ్మరి రాజేశ్వరి గోపాల్ అన్నారు. గ్రామ ప్రజల సహకారంతో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు.గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు, పచ్చదనం పెంపు వంటి అభివృద్ధి కార్యక్రమాలను దశలవారీగా చేపడుతున్నామని తెలిపారు. ప్రజలకు అవసరమైన ప్రతి ప్రభుత్వ సంక్షేమ పథకం అర్హులైన లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గ్రామ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని, ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని సర్పంచ్ రాజేశ్వరి గోపాల్ పేర్కొన్నారు. గ్రామంలో విద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయాల మెరుగుదలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.గ్రామ ప్రజల విశ్వాసానికి అనుగుణంగా పారదర్శక పాలన అందిస్తూ, అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి కృషి చేస్తామని ఆమె స్పష్టం చేశారు. గినియార్పల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని, గ్రామాభివృద్ధే తమ ధ్యేయమని సర్పంచ్ కుమ్మరి రాజేశ్వరి గోపాల్ మరోసారి పునరుద్ఘాటించారు.