
జనం న్యూస్ ఆగస్టు 17ముమ్మిడివరంప్రతినిధి(గ్రంధినానాజీ)రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం ఆధ్వర్యంలో రామచంద్రపురం నియోజకవర్గంలో నిరుద్యోగ నిర్మూలనే ధ్యేయంగా జరుగుతున్న జాబ్ మేళాలో భాగంగా ఈ నెల 20 న తేదీన ఉదయం 10:00 గంటల నుండి కెవిఆర్ హాస్పిటల్ దగ్గర గల ఉపాధి ఆఫీసులో 47వ జాబ్ మేళా నిర్వహింపబడుతుందని మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. 19 నుంచి 32 సంవత్సరాలలో టెన్త్, ఇంటర్ ,ఐటిఐ, డిప్లమా, డిగ్రీ ,బీటెక్, అభ్యర్థులకు శ్రీ సిటీ, కడప రేణిగుంట మేనకూరులో వివిధ పోస్టుల కొరకు డిక్సన్, హాల్దిక్సన్ ,ప్రీమియర్ ఎనర్జీ, నియోలింక్ ఎఫెక్ట్స్ , డైకిన్ కంపెనీ వంటి సుమారు 5 కంపెనీలలో ఉద్యోగాల కొరకు జాబ్ మేళా నిర్వహించ బడును. ఎంపికైన అభ్యర్థులకు 13000 నుంచి 23 వేల జీతం లభించును. అలాగే పిఎఫ్ ,ఈఎస్ఐ ,భోజన, వసతి, రవాణా, సదుపాయము ఆ కంపెనీలు ఆధారంగా లభించును. అర్హులైన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం కోరారు. మిగిలిన వివరములకు 7075704852 7075904852 నెంబర్లను సంప్రదించగలరు.