
పలు కంపెనీల్లో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు
జనం న్యూస్ ఆగస్టు 2424 ముమ్మిడివరం గ్రంధి నానాజీ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో నిరుద్యోగ నిర్మూలనే ధ్యేయంగా జరుగుతున్న జాబ్ మేళాలో భాగంగా ఈ నెల 27 న తేదీన ఉదయం 10:00 నుండి కెవిఆర్ హాస్పిటల్ దగ్గర గల ఉపాధి ఆఫీసులో 48వ జాబ్ మేళా నిర్వహింపబడుతుందని మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. 18 నుంచి 30 సంవత్సరాలలో టెన్త్, ఇంటర్ ,ఐటిఐ, డిప్లమా, డిగ్రీ ,బీటెక్, అభ్యర్థులకు శ్రీ సిటీ, కర్నూలు, రేణిగుంట, పెనుగొండ, బెంగళూరు, హైదరాబాదు ,హోసూర్‌లో వివిధ పోస్టుల కొరకు డిక్సన్, కియా, ఫాక్స్ కాన్, ఐటిసి ఫుడ్స్ ,హీరో ,టాటా మోటార్స్, షిన్డర్ ,ఇండో ఎంఐఎం ,వంటి సుమారు 15 కంపెనీలలో అసెంబ్లింగ్ ఆపరేటర్, ప్రొడక్షన్ ,క్వాలిటీ డిపార్ట్మెంట్లలో ఉద్యోగాల కొరకు జాబ్ మేళా నిర్వహించ బడును. ఎంపికైన అభ్యర్థులకు 14000నుంచి 30వేల జీతం లభించును. అలాగే పిఎఫ్ ,ఈఎస్ఐ ,భోజన, వసతి, రవాణా, సదుపాయము ఆ కంపెనీలు ఆధారంగా లభించును. అర్హులైన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం కోరారు. మిగిలిన వివరములకు 7075704852 7075904852 నెంబర్లను సంప్రదించగలరు.