
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం జులై. 03. 07. 2026జహీరాబాద్, జూలై 3:జహీరాబాద్ ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో ఈనెల 5న ఆదివారం ఉదయం 6 గంటలకు పట్టణంలోని శాంతినగర్ ఆదర్శ విద్యాలయం వద్ద ఉన్న హనుమాన్ మందిరం లో 214 వ నగర సంకీర్తన నిర్వహించనున్నట్లు ఆ సంస్థ బాధ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. హరేకృష్ణ మహామంత్ర జపం, శ్రీల ప్రభుపాదుల వారి ప్రార్థన, సంకీర్తన చేస్తూ శోభాయాత్ర, సంగారెడ్డి జిల్లా కంది అక్షయ పాత్ర బాధ్యులు విభిషణ్ దాస ప్రభుజీ ద్వారా సత్సంగ ప్రవచనం, నరసింహ ఆరతి ఇత్యాది కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. అదేవిధంగా ఈనెల 18 న నిర్వహించనున్న శ్రీ జగన్నాథ్ రథయాత్ర కు సంబంధించి భక్తులకు దిశానిర్దేశం చేయనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.