
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 08-07-26విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ గురు వారము ఉదయము 8.30 గంటలకు స్థానిక నందలూరు 33/11 సబ్ స్టేషన్ కాంపౌండ్ నందు స్ట్రగుల్ కమిటీ సమావేశం జరిగింది ఈ కార్య క్రమానికి ముఖ్య అతిధి గా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లా యిస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరి శ్రీహరి ఆద్వర్యం లో జరిగింది. ఆయన మాట్లాడుతూ విద్యుత్ యాజ మాన్యం ప్రభుత్వం, విద్యుత్ ఉద్యోగుల దీర్ఘ కాలిక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసు కోవడంలో నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తోందని, ఇందుకు నిరస నగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్య క్రమాలకు శ్రీకారం చేప ట్టామని వారు తెలిపారు. అందు లో భాగంగా, ఈనెల 15 వ తేదీన ఏ పి ఎస్ పి డి సి ఎల్ ఆపీసు, తిరుపతి వద్ద మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లా యిస్ యూనియన్ రాజంపేట డివిజన్ అధ్యక్షుడు ఎరికల్ రెడ్డి మాట్లాడుతూ, వేతన సవరణ కమిటీ వెంటనే ఏర్పాటు చేయా లని, పెండింగ్ లో ఉన్న 4 కరువు భత్యం బకాయిలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంటాక్ట్ వర్కర్ యూనియన్ రాజంపేట డివిజన్ కార్యదర్శి పి బాలకృష్ణ మాట్లా డుతూ కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ కార్మికులను రెగులర్ చేయాలనీ, ఆయన డిమాండ్ చేశారు.డివిజన్ ఉపాధ్యక్షులు ఎం రాజా మాట్లాడుతూ, డిస్కం పరిధిలోని పెండింగ్ లో వున్న ఉద్యోగుల కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. డివిజన్ సహాయ కార్యదర్శి కే రమేష్ మాట్లాడుతు టాటా ఏ ఐ జి పాలసీ చాలా అధ్వానంగా ఉందని ఈ పాలసీ మీద యాజమాన్యం వెంటనే చర్యలు తీసుకొని కార్మికులకు న్యాయం చేయాలని అలాగే పాత పెన్షన్ అమలు చేయాలని, డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాజంపేట డివిజన్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు కే సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులకు తెలంగాణ తరహాలో 48 వేల రూపాయలు జీతం చెల్లించాలని ఆయన తెలిపారు. అపరిమిత మెడికల్ సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు. షరతులు లేకుండా కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులర్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశం లో నందలూరు సెక్షన్ స్ట్రగుల్ కమిటీ సభ్యులు. హరి. శీను, ఉమా, కేశవ , నిషార్ భాష, రవి తదితరులు పాల్గొన్నారు.