
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా 21-06-26కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం, నందలూరు మండలం, పాటూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఎగువ కుమ్మరపల్లి గ్రామంలో తిరుపతికి చెందిన నరేంద్ర హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నేడు ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించబడింది.ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజంపేట పార్టీ నాయకులు, మాజీ జడ్పిటిసి సభ్యులు యల్లటూరు శివరామ రాజు శిబిరాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద మరియు మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఎంతో ఉపయోగ పడతాయని అన్నారు.ప్రజలకు సేవా భావంతో వైద్య శిబిరాన్ని నిర్వహించిన డాక్టర్ ఉదయ్ ని, అలాగే కార్యక్రమం విజయ వంతం కావడానికి కృషి చేసిన స్థానిక నాయకులు బొమ్మల రాజు మధుసూదన్ రాజు ని యల్లటూరు శివరామ రాజు ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వైద్య సిబ్బంది మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.