
జనం న్యూస్ ఆగస్టు 2 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : ఆషాఢ మాస బోనాల మహోత్సవాల సందర్భంగా, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి, టీపీసీసీ ఉపాధ్యక్షులు మరియు తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ తన సతీమణితో కలిసి సికింద్రాబాద్లోని ప్రసిద్ధ ఉజ్జయిని శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని వారు ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో పుష్ప రెడ్డి, రమేష్, అస్లాం, విశాల్, బాలు, అనిల్, సతీష్,రవి తదితరులు పాల్గొన్నారు.