
జనం న్యూస్07: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించి గ్రామపంచాయతీ పరిధిలోని ముసలమ్మకుంట చెరువు పూడిక పనులను గురువారం ఎంపీడీవో వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలు, మేట్స్ సిబ్బందితో మాట్లాడి పనుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. పని ప్రదేశంలో కచ్చితంగా ఫస్ట్ ఎయిడ్ కిట్, త్రాగునీరు, ఓఆర్ఎస్ పాకెట్లు వంటి సౌకర్యాలు కల్పించాలని గ్రామపంచాయతీ మరియు ఈజీఎస్ సిబ్బందిని ఆదేశించారు. వేసవి తీవ్రత దృష్ట్యా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమేపనులునిర్వహించాలని సూచించారు.అలాగే ఎండల నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని, జాబ్ కార్డు కలిగిన ప్రతి కూలీ విధిగా పనికి హాజరు కావాలని తెలిపారు. జాబ్ కార్డు ఉన్నప్పటికీ పనులకు హాజరు కాని వారి జాబ్ కార్డులను తొలగించే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. అర్హత కలిగిన ఉపాధి హామీ కూలీలందరూ తప్పనిసరిగా పనులకు హాజరు కావాలని ఎంపీడీవో కోరారు.