
జనం న్యూస్ జులై 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం గ్రామపంచాయతీకి సంబంధించిన పనులలో, నిర్ణయాలలో వార్డు సభ్యులకు తెలియకుండానే సర్పంచ్ ఉప సర్పంచ్ పనులను చేపడు తున్నారని, విత్ డ్రాలు చేస్తున్నారని గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ఎం పీ డీ ఓ ఫణి చంద్ర కు. వినతి పత్రం అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఎస్సీ రుణా లలో వార్డు సభ్యులకు తెలియకుండానే ఎంపికలు చేశారని తెలిపారు. గ్రామ పంచాయతీ పనులకు సంబంధించిన డబ్బులు విషయంలో సభ్యులకు తెలియకుండానే విత్ డ్రా లు చేస్తున్నారని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక విషయంలో కూడా సభ్యులకు సమాచారం ఇవ్వకుండా ఎంపిక చేశారని చెప్పారు. గ్రామపంచాయతీ కి సంబంధించిన డబ్బులు కూడా ఇష్టం వచ్చినట్లు గా వాడుకుంటున్నారని ఆరోపించారు. ఇకనుండి వార్డు సభ్యులకు తెలియ కుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా చెల్లింపులు చేయకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు గ్రామ కార్యదర్శి ఎస్ఐఆర్ ప్రోగ్రాంలో ఉన్నారని, ఆయనకు తెలియకుండా పూర్తి బాధ్యతలు చేపట్టే వరకు విత్ డ్రాలు నిలిపివేయాలని ఎంపీడీవోను కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాయంపేట గ్రామ వార్డు సభ్యులు 1 కురకుల మంజుల 2 కోల సుజాత 3 చేల్పరి బంటి 4 ఉప్పు రంజిత్ 5 మార్త ప్రవళిక 6 పరిమళ్ళ నోములేశ్వర్ 7 కొత్తపల్లి వీందర్ 8 రాయకుల సుమన్ 9 ముంజల నందీని 10 మారపెల్లి ప్రియాంక 12 ధైనంపెల్లి సుమన్ 13 మారపెల్లి రమ దైనంపెల్లి అరుంధతి తదితరులు పాల్గొన్నారు.....