
జనం న్యూస్ ఆగస్టు 17 అమలాపురం అమలాపురం: ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ 70వ ఆవిర్భావ దినోత్సవాన్ని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఘనంగా నిర్వహించారు. ఎపియుడబ్ల్యుజే జిల్లా అధ్యక్షులు మండేల నాగ వెంకట ప్రసాద్ బాబి అధ్యక్షతన ప్రెస్ క్లబ్ సమావేశ మందిరంలో ఆవిర్భావ దినోత్సవ సమావేశం జరిగింది. పట్టణ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వీరబాబు ముఖ్య అతిథిగా హాజరై యూనియన్ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వీరబాబు మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల కోసం, సంక్షేమం కోసం యూనియన్ చేస్తున్న కృషిని అభినందించారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సేవలు, సమాచారం అందించడంలో జర్నలిస్టుల పాత్ర అభినందనీయమని కొనియాడారు. అధ్యక్షులు మండేల నాగ వెంకట ప్రసాద్ బాబి మాట్లాడుతూ గత 70 సంవత్సరాలుగా జర్నలిస్టుల హక్కుల కోసం, సంక్షేమం కోసం యూనియన్ నిర్వహించిన పాత్రను వివరించారు. జాతీయ స్థాయిలో ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ కు అనుబంధంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం అనేక పోరాటాలు చేసి విజయం సాధించామని తెలిపారు. జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘ అధ్యక్షులు కొర్లపాటి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ గత 70 సంవత్సరాలుగా జర్నలిస్టుల సంక్షేమానికి యూనియన్ కృషి చేస్తోందని, యూనియన్ ను మరింత బలోపేతం చేయడం కోసం సభ్యులు ఐక్యతతో ముందుకు వెళ్లాలని కోరారు.అనంతరం ప్రెస్ క్లబ్ నుండి బైక్ ర్యాలీగా ఎర్ర వంతెన, నల్ల వంతెనల మీదుగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కు అధ్యక్షులు మండేల నాగ వెంకట ప్రసాద్ బాబి యూనియన్ డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ సభ్యులు పరసా సుబ్బారావు, జిల్లా కోశాధికారి ఎం వి అబ్బాస్, అక్రెడిటేషన్ కమిటీ సభ్యులు సుంకర ప్రసాద్, రంకిరెడ్డి కృష్ణ, పిల్లి శేఖర్, నియోజకవర్గ అధ్యక్షులు అరిగెల రుద్ర శ్రీనివాస్, సభ్యులు ఆకుల రవితేజ, పొట్టుపోతు నాగు, రంబాల నాగ సత్యనారాయణ, దుర్గా ప్రసాద్, దొమ్మేటి వెంకట్, జి ప్రకాష్, ఆసు భరత్, పి ఈశ్వరరావు, ఎస్ మురళి, కుడిపూడి గణపతి, కానుబోయిన దుర్గ ప్రసాద్, చొల్లంగి ప్రసాద్, కడలి సాయి, గుర్రం బాబ్జి, కట్టా మురళి, కె బుజ్జి, మట్టపర్తి రమేష్, ఎం నీలకంఠం తదితరులు పాల్గొన్నారు.