
జనం న్యూస్ మే 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీఅధికారిక కాన్వాయ్‌ను పక్కనబెట్టి ఈ- బైక్ పై భీమవరంలో పర్యటనకేంద్రమంత్రి శ్రీనివాస వర్మ ఇంధన సంక్షోభాన్ని అధిగమించేందుకు పొదుపు పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడమే ధ్యేయంగా కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తన అధికారిక కాన్వాయ్‌ను పక్కన పెట్టి, స్వయంగా ఎలక్ట్రిక్ బైక్‌ను నడుపుతూ భీమవరం పట్టణంలో ఆదివారం పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తన నివాసం నుండి " స్వయంగా ఎలక్ట్రిక్ బైక్‌ను నడుపుతూ క్యాంప్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అనంతరం స్థానికంగా పలు కార్యక్రమాలకు ఎలక్ట్రికల్ బైక్ పై వెళ్ళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ఇంధన వనరులపై ఒత్తిడి పెరుగు తోందని, ఈ తరుణంలో దేశీయ అవసరాల దృష్ట్యా ఇంధనాన్ని పొదుపు చేసుకోవడం ప్రతి ఒక్కరి కనీస సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ వాడ కాన్ని వీలైనంత వరకు తగ్గించి, ప్రతి ఒక్కరూ పర్యావరణహిత ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వైపు మొగ్గు చూపాలని ఆయన కోరారు. ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో కేవలం దూర ప్రాంతాలకు వెళ్లవలసి వచ్చినప్పుడు మాత్రమే వాహనాలను ఉపయోగించాలని స్థానిక ప్రయాణాలకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిం చాలని సూచించారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో పెట్రోలియం ఉత్పత్తుల వాడకం తగ్గించడం ద్వారా అటు దేశ ఆర్థిక వ్యవస్థకు, ఇటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి పౌరుడూ తమ వంతు భాగస్వామ్యం అందించాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపును స్ఫూర్తిగా తీసుకుని, కేంద్ర మంత్రి స్వయంగా బైక్ నడుపుతూ అవగాహన కల్పించడం స్థానిక ప్రజలను, యువతను విశేషంగా ఆకట్టుకుంది.