
జనం న్యూస్ 27 జూన్ 2026 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) హనుమకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండల కేంద్రంలో శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నూతన మండల అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.ఎల్కతుర్తి బీరన్నగుడి వద్ద జరిగిన ఈ సమావేశంలో నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ముప్పు శ్రీనివాస్ కు సీనియర్ నాయకులు మర్యాదపూర్వకంగా శాలువాతో సన్మానించారు వారి ఆశీస్సులు తీసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు మండల అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్ఠానానికి, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో ఎలాంటి భేదాభిప్రాయాలకు తావులేకుండా అందరినీ సమానంగా గౌరవిస్తూ కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు. కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేసి, రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటేలా ప్రతి కార్యకర్త కష్టపడాలని పిలుపునిచ్చారు. "మనం చెట్టుకు కొమ్మల్లా ఐక్యంగా ఉండి పార్టీ విజయానికి కృషి చేయాలి" అని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు సింగిల్ విండో మాజి అధ్యక్షులు గోలీ రాజేశ్వర్ రావు, గ్రామ శాఖ అధ్యక్షుడు శీలం అనిల్ కుమార్ , మాజీ సర్పంచ్ గొడిశాల యాదగిరి గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఏఎంసీ డైరెక్టర్ గొడిశాల రాజయ్య గౌడ్, మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు పాక రమేష్, వెంకటేష్ బొజ్జ గోపాల్ బొల్లెపోగు రమేష్ జనగాని లక్షిమినారయణ గొడిశాల అర్జున్ అంబాల జగన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నాయకులు పార్టీ బలోపేతంపై అభిప్రాయాలు, సూచనలు తెలియజేశారు