
జనం న్యూస్ జూన్ 12 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి మూసాపేట్ గడిగుట్ట మైసమ్మ ఆలయం సమీపంలో నిర్మాణంలో ఉన్న ఎల్లమ్మ తల్లి దేవాలయ నిర్మాణానికి సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చిన మూసాపేట్ గౌడ సంఘం రూ.10 లక్షల విరాళం అందజేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం స్థానిక భక్తులు, దాతల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.ఈ మేరకు తొలి విడతగా రూ.5 లక్షల నగదును ఆలయ కమిటీ సభ్యులు, చైర్మన్ ఐలయ్య, కేబుల్ శ్రీనివాస్, బిక్షపతి, రామచంద్ర సింగ్‌లకు శుక్రవారం అందజేశారు. మిగిలిన రూ.5 లక్షలను ఈ నెలాఖరు లోపు అందజేయనున్నట్లు గౌడ సంఘం ప్రతినిధులు తెలిపారు.ఈ కార్యక్రమంలో మూసాపేట్ నల్ల పోచమ్మ గుడి చైర్మన్ రాచమల్ల బిక్షపతి గౌడ్, లక్ష్మణ్ గౌడ్, అంజి గౌడ్, వెంకటేష్ గౌడ్, అనంతయ్య గౌడ్, రాచమల్ల శేఖర్ గౌడ్, గుడికాడ శ్రీనివాస్ గౌడ్, కొత్తపల్లి రవి గౌడ్, బాలరాజు గౌడ్, పాండు ముదిరాజ్, నర్సింగ్ తదితరులు పాల్గొని ఆలయ నిర్మాణానికి తమ సంపూర్ణ సహకారాన్ని ప్రకటించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, ఇప్పటివరకు తమ వంతు సహాయ సహకారాలు అందించిన ప్రతి దాతకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఎల్లమ్మ తల్లి ఆలయ నిర్మాణ పనులు మరింత వేగవంతంగా పూర్తయ్యేందుకు ఇంకా ఎక్కువ మంది దాతలు ముందుకు వచ్చి సహకరించాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేశారు.భక్తుల సహకారంతో నిర్మితమవుతున్న ఎల్లమ్మ తల్లి ఆలయం భవిష్యత్తులో ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని, సమాజంలో ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.