
జనం న్యూస్ 17జులై పెగడపల్లి నాబార్డ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని రాజారంపల్లి గ్రామంలో అవగాహన సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నాబార్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ దిలీప్ చంద్ర పాల్గొని నాబార్డ్ స్థాపననేపథ్యం,గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత మరియు వ్యవసాయాభివృద్ధిలో నాబార్డ్ పోషిస్తున్న కీలక పాత్రను వివరించారు.ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్ రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఫ్ పి ఓస్) ప్రాధాన్యతను వివరించి, సమిష్టి వ్యవసాయం మరియు మార్కెటింగ్ ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచుకోవచ్చని తెలిపారు. అలాగే ఎల్నినో ప్రభావం వల్ల ఈ సంవత్సరం వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులు సాంప్రదాయ పద్ధతిలో వరి సాగుపైఆధారపడకుండా , ఆరుతడి పంటలేనటువంటి కంది, పెసర, మినుము సాగు చేయాలని సూచించారు. అదేవిధంగా సహజ వ్యవసాయం ప్రాముఖ్యత, భూసార పరిరక్షణ, సాగు ఖర్చుల తగ్గింపు మరియు స్థిరమైన వ్యవసాయం వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు.ఈ కార్యక్రమంలో రాజారంపల్లి సర్పంచ్ రమేష్ వ్యవసాయ విస్తరణ అధికారి అక్షయ్,ఎన్జీఓ కోఆర్డినేటర్ సంపత్, పంచాయతీ కార్యదర్శి, పొన్నగుట్ట మల్లికార్జున స్వామి ఎఫ్పీఓ మేనేజింగ్ డైరెక్టర్, ఎఫ్పీఓ డైరెక్టర్లు, సభ్యులు, స్వయం సహాయక సంఘాల మహిళలు (ఎస్ ఎచ్ జి సభ్యులు) మరియు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.