
జనం న్యూస్ 07 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను జిల్లాలో సజావుగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) మధుమోహన్ అన్నారు. ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియపై సోమవారం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి హైదరాబాద్ నుంచి సంబంధిత అధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ ఎన్నుమరేషన్ పత్రాలను ప్రతి ఇంటికి అందజేయడమే కాక పూరించిన పత్రాల వివరాలను నిర్దేశిత యాప్ లో ఎప్పటికప్పుడు బిఎల్వోలు నమోదు చేసేలా మండలాల అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. పత్రాలను పూరించడంలో ఇబ్బందులు పడుతున్న ఓటర్లకు బిఎల్ఎలు, వాలంటీర్లు సహకరించేలా చూడాలన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్ఐఆర్ పై ప్రతి బుధవారం సమావేశం నిర్వహించాలన్నారు. గద్వాల ఐడిఓసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి సంబంధిత జిల్లా అధికారులతో కలిసి వీసీ లో పాల్గొన్న అదనపు కలెక్టర్ మధుమోహన్ మాట్లాడుతూ జిల్లాలో దాదాపుగా ప్రతి ఇంటికి ఎన్నుమరేషన్ పత్రాలను ఇవ్వడం జరిగిందని, వాలంటీర్ల సహకారంతో ఓటర్లు ఆ పత్రాలను ఫిలప్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ నిబంధనల ప్రకారం చేయడం జరుగుతుందని తెలిపారు. వీసీ అనంతరం వివిధ మండలాల తహసిల్దార్లతో అదనపు కలెక్టర్ మాట్లాడారు. బిఎల్ఓ లకు ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సూపర్వైజర్లు ఏఈఆర్వోలు వాటిని పరిష్కరించాలన్నారు. ఒకే కుటుంబంలోని ఓటర్లందరూ ఒకే పోలింగ్ స్టేషన్లో నమోదయ్యేలా చూడాలన్నారు. ఓటరు జాబితాలో తప్పులు లేకుండా పారదర్శకంగా రూపొందించేందుకు నిర్వహిస్తున్న ఓటరు జాబితా సమగ్ర సవరణను జిల్లాలో పచ్చడ బందీగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులందరూ చిత్తశుద్ధితో పనిచేయాలని ఈ సందర్భంగా అదనపు కలెక్టరు పేర్కొన్నారు ఈ సమావేశంలో ఆర్డీవో శ్రీనివాసరావు ఎన్నికల విభాగం అధికారి మంజుల వివిధ మండలాల తహసిల్దార్లు ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు
