
జనం న్యూస్ జులై 7 చిలిపిచేడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలోని చండూరు గ్రామంలో ఎస్ ఐ ఆర్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని మండల అధికారులు పలు సూచనలు తెలియజేశారు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ఎస్ ఐ ఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని ఓటర్ జాబితా సమగ్ర సవరణ ప్రక్రియపై మండల అధికారులు అవగాహన నిర్వహించారు గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ ఎన్నిమరేషన్ పత్రాలను ప్రతి ఇంటికి అందజేయడం జరిగిందని తెలియజేశారు అందజేసిన పత్రాల వివరాలను నిర్దేశిత యాప్ లో ఎప్పటికప్పుడు బి ఎల్ వో లు నమోదు చేసేలా మండల అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు పత్రాలను పూరించడంలో ఇబ్బందులు పడుతున్న ఓటర్లకు బిఎల్ఓ లు సేకరించేలా చూడాలన్నారు ప్రతి ఇంటికి పత్రాలను ఇవ్వడం జరిగిందని అలాగే మంగళవారం ఉదయం గ్రామపంచాయతీ ఆఫీసులో ఎన్నిమరేషన్ పత్రాలను బిఎల్వోలు ఫిలప్ చేయాలని మండల అధికారులు తెలియజేశారు ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు వచ్చిన ఒకే కుటుంబంలో నీ ఓటర్లందరూ ఒకే పోలింగ్ స్టేషన్లో నమోదు అయ్యేలా చూడాలన్నారు ఓటర్ జాబితాలో తప్పులు లేకుండా పారదర్శకంగా రూపొందించేందుకే నిర్వహిస్తున్న ఓటరు జాబితా సమగ్ర సవరణ సంబంధిత అధికారులందరూ చిత్తశుద్ధితో పనిచేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు గ్రామ సర్పంచ్ శేషాద్రి ఉపసర్పంచ్ మన్నే వెంకటేశం వార్డ్ మెంబర్స్ అంగన్వాడీ టీచర్స్ మండల అధికారులు జిపిఓ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు