
జనం న్యూస్,2026 సెప్టెంబర్ 11, ( జహీరాబాద్ నియోజక వర్గం ప్రతినిధి ) సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ లో, స్పిరిట్ క్వెస్ట్ ఇంటర్నేషనల్ ( ఎస్ క్యూ ఐ ) పెంతే కోస్టల్ డయాసిస్ సేవలు, అభినందనీయమని, ఇండియా బిషప్ రమేష్ బాలన్ అన్నారు. జహీరాబాద్ పట్టణ పరిధిలోని యేసయ్య మందిరం అపోస్తుల మినిస్ట్రీ వారి ఆధ్వర్యంలో, సేవకుల ఆర్డినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ క్యూ ఐ ఇంటర్నేషనల్ పెంతేకోస్తుల డయాసిస్ ఇండియా బిషప్ రమేష్ బాలన్ హాజరయ్యారు.ఈ సందర్భంగా 30 మంది దైవ సేవకులకు ఆర్డినేషన్ మరియు మ్యారేజ్ రిజిస్టర్ లైసెన్సులు వారి చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా రమేష్ బాలన్ మాట్లాడుతూ మరుమూల గ్రామాలలో, దేవుని సువార్త పరిచర్య జరిగిస్తున్న సేవకులను ప్రోత్సహించడం తమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఎస్ క్యూ ఐ సంస్థలో పనిచేస్తున్న పాస్టర్లకు సామాజిక మరియు ఆరోగ్య భద్రత కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. ఎస్ క్యూ ఐ పెంతే కోస్తూల డయాసిస్ ఈ కార్యక్రమంలో ఇండియా పి ఆర్ ఓ బిషప్ మదన రాజు, ఐదు రాష్ట్రాల బిషప్ జి. ప్రకాష్, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ బిషప్ వై. సతీష్ రెడ్డి, ఎస్ క్యూ ఐ సెంట్రల్ ఆఫీస్ ఇంచార్జ్ ధన శేఖర్, జహీరాబాద్ పట్టణంలో బిషప్ జి.కిరణ్ కుమార్, రెవరెండ్ మాణిక్యమ్మ, బిషప్ జి నవీన్ కుమార్, రెవరెండ్ జి. అక్షర, రెవరెండ్ సిహెచ్ నవీన్ బాబు, రెవరెండ్ సి.హెచ్. సులోచన, రెవరెండ్ టోని, మరియు దైవ సేవకులు పెద్ద ఎత్తున పాల్గొని ఆర్డినేషన్ ను విజయవంతంగా జరిపించారు.