
జనం న్యూస్ 03 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులంబ గద్వాల్ జిల్లాకు వస్తున్న మన సీఎం రేవంత్ రెడ్డి గద్వాల పర్యటనపై మీడియా సమావేశంలో మండిపడిన నియోజక వర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్.కేశవ్ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగర్ దొడ్డి వెంకట్రాములు గద్వాల నియోజక వర్గంలో పెండింగ్ ప్రాజెక్టుల పరిస్థితిపై సమాధానం చెప్పే గద్వాల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించాలని బాసు హనుమంతు నాయుడు డిమాండ్ చేశారు ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రేపు గద్వాలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై పార్టీ నాయకులతో కలిసి,మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ర్యాలంపాడు,గట్టు ఎత్తిపోతల పథకం నెట్టంపాడు ప్రాజెక్టు లు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన పనులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక,ప్రాజెక్టులపై ఉన్న మిగతా పెండింగ్ పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్నాయని విమర్శించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలో చేపడుతున్న పర్యటన అభివృద్ధి కోసం అయితే గద్వాల నియోజకవర్గంలోని పెండింగ్ ప్రాజెక్టుల పరిస్థితిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చిన్న కాలువలో చెట్ల వెలిసిన తొలగించని స్థితిలో ప్రభుత్వము ఉన్నదని విమర్శించారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అభివృద్ధి పనులకు నిధులు తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు ముఖ్యమంత్రి జూరాల గుడ్డెందొడ్డి ప్రాజెక్టులను సందర్శిస్తున్న సమయంలో గద్వాల నియోజకవర్గానికి సంబంధించి గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన ప్రాజెక్టులు కొంత మేరకు పెండింగ్ ఉన్నాయని ఆ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించి నిధులు మంజూరు చేయాలని వారు కోరారు నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులపై స్పష్టమైన హామీ ఇవ్వకుండా సీఎం పర్యటన కొనసాగడం సిగ్గుచేటు అని అన్నారు.గద్వాల ప్రజల సాగు,తాగునీటి అవసరాలకు కీలకమైన ప్రాజెక్టుల పనులు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయని వాటి పూర్తి కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి సమయం ఇస్తే,గద్వాల నియోజకవర్గ సమస్యలపై బిఆర్ఎస్ పార్టీ తరపున వినతి పత్రం అందజేస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర రెడ్డి జి.రాఘవేంద్ర రెడ్డి బీచుపల్లి, పటేల్ జనార్దన్ రెడ్డి కురువ పల్లయ్య,కౌన్సిలర్లు మోహన్ యాదవ్ చిత్తరి కిరణ్ రామకృష్ణ రఘు నాయుడు డ్యామ్ శ్రీను వెంకటేష్ యాదవ్ మోహన్ వినయ్ చాకలి శ్రీనివాసులు మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు